ఓఆర్​ఆర్ పరిధి దాటిన 'హైడ్రా బుల్డోజర్లు' - ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని ఆక్రమణలే లక్ష్యమా?

  • 2 days ago
Hydra Crossed ORR Limits : గ్రేటర్‌ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇకపై ఔటర్ రింగ్‌ రోడ్డు దాటి బుల్డోజర్లతో విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఓఆర్​ఆర్​ బయటి నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హెచ్​ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని ఆక్రమణలను అధికారులు పరిశీలించడంతో హైడ్రా ఔటర్ దాటుతుందనే అంశానికి మరింత బలం చేకూరింది.

Category

🗞
News

Recommended