కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలపై హైడ్రా పంజా - 16 నిర్మాణాలు నేలమట్టం
Hydra Demolitions In Hyderabad : హైదరాబాద్లో హైడ్రా మరోసారి తన పంజా విసిరింది. కూకట్పల్లిలోని నల్లచెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఎకరంపైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగిన ఈ కూల్చివేతల్లో హైడ్రా ఎక్కడా వెనుకంజ వేయకుండా తన పని పూర్తి చేసింది. బాధితులు అధికారులు, సిబ్బందిని ప్రాధేయపడుతూ కాళ్లమీద పడినా ఆ నిర్మాణాలను కూల్చివేసేదాక అక్కడి నుంచి కదల్లేదు. అయితే ఈ కూల్చివేతల్లో ఆక్రమణదారులు బాగానే ఉన్నా వారి వద్ద నుంచి భూమిని లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తున్న సామాన్యులు కోట్లలో నష్టపోవాల్సి వచ్చింది.
Category
🗞
News