మరోసారి వార్తల్లో వెంకయ్య నాయుడు , వారికి ఓటు వేయకండి *Politics | Telugu OneIndia

  • 2 years ago
Former Vice president Venkiah Naidu travel along with Genereal passengers in the Train | మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. సాధారణ ప్రయాణీకులతో కలిసి రైళ్లో ప్రయాణం చేసారు. తాను రాష్ట్రపతి కాలేదనే బాధ లేదన్నారు.ఏడు పదుల వయసు వచ్చినా తనలో ఓపిక, శక్తి తగ్గలేదని వెంకయ్య చెప్పారు. తిరగ గలిగినన్ని రోజుల ప్రజల మధ్య ఉంటూ వారికి చెప్పాల్సినవి చెప్పి..చైతన్యం తెస్తానని పేర్కొన్నారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్టు ఉ్న వ్యక్తులను ఎన్నుకోవాల్సింది పోయి ఆ నాలుగు "సి" ల స్థానంలో క్యాష్.. క్యాస్ట్..కమ్యూనిటీ.. క్రిమినాలిటీ ఉన్న వారిని గెలిపిస్తున్నారని విశ్లేషించారు. కొందరు కులం, మతం, వర్ణం, వర్గం పేరుతో చల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజాధనం దోచుకున్న వారిని..ప్రాంతాల మధ్య విభేదాలను తీసుకొచ్చే వారిని దూరం పెట్టాలని వెంకయ్య పిలుపునిచ్చారు.



#VenkaiahNaidu
#National
#Andhrapradesh
#BJP
#India
#PMmodi
#VicePresidentIndia

Recommended