నోటా కి టాటా చెప్పండి, ఇప్పటికైనా మారండి - పవన్ కల్యాణ్ *Politics | Telugu OneIndia

  • 2 years ago
Recently, Pawan Kalyan expressed his opinion on the note in a two-day review meeting at the party office in Mangalagiri | ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండురోజులపాటు నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పవన్ కల్యాణ్ నోటాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నోటాకు ఓటు వేస్తే అది వృథా చేసుకోవడమేనని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఓటమిపాలయ్యేవారికి ఓటు వేస్తే వృథా అవుతుందని కొందరు చెబుతుంటారని, అప్పుడు ఓటు వృథా గురించి ఆలోచించేవారు నోటాకు వేస్తే వృథా అవుతుందని ఎందుకు భావించరని నిలదీశారు. నోటాకు ఓటు వేసినవారివల్లే క్రిమినల్స్ రాజ్యమేలుతున్నారన్నారు. పరోక్షంగా నోటాకు ఓటువేసే మేధావులంతా క్రిమినల్స్ కే మద్దతిచ్చినట్లనన్నారు. ఎక్కువ మంది ఓటు వేయడానికి రావాలని, ఎవరో ఒకరికి ఓటు వేయాలని జనసేనాని పిలుపునిచ్చారు.




#Janasena
#PavanKalyan
#PowerStar
#YSRCP
#TDP
#AndhraPradesh
#CMjagan

Recommended