ఘోర అగ్ని ప్రమాదం.. చూస్తుండగానే రూ.కోట్ల విలువైన ఉత్పత్తులు దగ్ధం

  • 2 years ago
వరంగల్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గీసుకొండ మండలం ధర్మారం పరిధిలోని టెస్కో గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలోని దుస్తులు, బెడ్ షీట్లు, కార్పెట్లు వంటి ఉత్పత్తులన్నీ దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్లు చేరుకునేలోపే మంటలు పూర్తిగా వ్యాపించాయి. ఓ దశలో మంటలు విజృంభించడంతో మరిన్ని ఫైరింజన్లను రప్పించారు. ఈ ఘటనలో రూ.40 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.