Tirupati LokSabha Bypoll | Oneindia Telugu

  • 4 years ago
Speculations rife over Janasena's contest in Tirupati lok Sabha by poll as already BJP declared that they are contesting in the by poll. According to the speculations,Pawan might discuss about Tirupati by poll in Mangalagiri party meeting on Monday.

#Pawankalyan
#Tirupati
#Ysrcp
#Andhrapradesh
#Ysjagan
#Bjp
#TirupatiBypolls
#TirupatiElections

కలిసి నడిచే దారిలో ఎవరి లెక్కలు వారివైతే కష్టం... సయోధ్య కుదరకపోతే,రాజీ పడకపోతే 'పొత్తు' లెక్క తప్పుతుంది... ఆంధ్రప్రదేశ్‌లో 'తిరుపతి' కేంద్రంగా వేగంగా మారుతున్న రాజకీయాలు ఈ చర్చకు ఊతమిస్తున్నాయి. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇటీవల తెలంగాణలోని 'దుబ్బాక' ఉపఎన్నికలో బీజేపీ గెలుపు.. ఏపీలోని కమలనాథుల్లో ఆశలు చిగురించేలా చేసింది. తిరుపతి ఆధ్యాత్మిక నగరం కావడం... బీజేపీ హిందుత్వ ఎజెండా ఉన్న పార్టీ కావడంతో.. ఇక్కడ తాము గెలుపు జెండా ఎగరవేయవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. అదే సమయంలో మిత్రపక్షం జనసేన కూడా తనదైన లెక్కతో ముందుకు కదులుతున్నట్లు ఊహాగానాలు బయలుదేరాయి. ఇంతకీ జనసేన లెక్కేంటి... తిరుపతి బరిలో బీజేపీ-జనసేన రాజకీయం ఎలా ఉండబోతుంది...