• 5 years ago
Tirumala Tirupati Devasthanam is likely to be cut the budget allocation to the Lord Venkateswara replica temple of Tirumala, which is under construction at Venkatayapalem in Capital city region Amaravathi in Andhra Pradesh. TTD is ready to cut the budget from Rs 126 Crores to Rs 30 Crores, source said. Inn the row of information circulated in Social Media that Amaravathi could be shifted another place row, TTD likely to be taken this decision.
#tirumala
#tirupati
#ttd
#yvsubbareddy
#amaravathi
#Jagan
#budget
#chandrabau
#tdp
#ysrcp

రాజధాని అమరావతిని వేరే ప్రాంతానికి తరలిస్తారనే వార్తలు కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. దీనికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం మరో సంకేతం ఇచ్చినట్టే కనిపిస్తోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాంతం పరిధిలో చేపట్టిన భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణాన్ని ఇప్పటికే నిలిపివేసిన సర్కార్.. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం వెంకటాయపాలెం సమీపంలో నిర్మాణంలో ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి బడ్జెట్ మొత్తాన్ని కుదించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అజెండాను టీటీడీ అధికారులు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. రాజధాని అమరావతిని తరలింపు ప్రక్రియలో భాగంగానే వెంకటాయపాలెంలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను కుదించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Category

🗞
News

Recommended