కొనసాగుతున్న ZPTC,MPTC ఓట్ల లెక్కింపు || Oneindia Telugu

  • 5 years ago
ZPTC and MPTC elections Vote counting is underway. As many as 6,500 ballot boxes, spread across 123 locations, will be opened under the observation of returning officers. Votes polled in 32 districts of the State have been counting. The counting was earlier scheduled for June 27, however it was postponed.
#elections
#zptc
#mptc
#votes
#counting
#telangana

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 123 చోట్ల ఓట్లు లెక్కిస్తున్నారు. మధ్యాహ్నానికి ఫలితాల సరళి వెలువడనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లోని 978 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు గంటల లోపే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ సెంటర్లకు తరలించారు. ఎంపీటీసీ ఓట్లు లెక్కింపు పూర్తైన అనంతరం జెడ్పీ ఓట్లు లెక్కించనున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో 35,529 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కించనుండగా... ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలవారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలను ముందుగా లెక్కిస్తున్నారు. అనంతరం వాటిని 25 బ్యాలెట్ పేపర్ల చొప్పున బండిల్ చేయనున్నారు.

Recommended