• 5 years ago
మన మెదడు అన్నింటినీ నిక్షిప్తపరుస్తుంది. కావలసినపుడు గుర్తు తెచ్చుకునేందుకు సహకరిస్తుంది. కానీ అదే విజ్ఞానం కొన్నేళ్ల తరువాత ఇతరులకు అందాలంటే కష్టమే మరి. ఆ సమస్యనుంచి బయటపడటానికి మనిషి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం తాను అనుకున్న భావాలను వ్యక్తపరచడానికి పుస్తకాల రూపం సరిగ్గా సరిపోయింది. ప్రతి విషయాన్ని పరిశీలించి శోధించి రాసిన పుస్తకాలు ఇన్ని అని చెప్పడం చాలా కష్టమైన పని అని భద్రపరిచేందుకు ఒక చిన్న ఇల్లు కట్టవలసి వచ్చింది దానిని మనం ఇంగ్లీషులో లైబ్రరీ అని తెలుగులో గ్రంథాలయం అని పిలుస్తున్నాం. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమం నడిపి దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాల్లో Asur Banipaal గ్రంధాలయం ముఖ్యమైనది చిత్రలిపిలో వ్రాయబడే మట్టి పలకల రూపంలో గ్రంథాలు ఉండేవి. అటువంటి వేలాది మట్టి పలకల గ్రంథాలను ఇక్కడ భద్రపరిచేవారు వీటిలో Gill gamesh అనే సుమేరియన్ ఇతిహాస ప్రతి గ్రంథాలు కూడా ఉండేవి. ఇవి ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచి ఉన్నాయి క్రీస్తుపూర్వమే లైబ్రరీల ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరిగినట్లు ఆధారాలున్నాయి ఆనాటి గొప్ప రాజవంశీయుడు అబ్రహాం పరిపాలించిన నగరం Urr. ఈ నగరంలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన త్రవ్వకాలలో రాజముద్రిక దొరికింది చిన్న స్థూపాకారంలో ఉన్న ఈ ముద్రికపైన కొన్ని రాతలు కనుగొన్నారు ఈ రాతలు క్రీస్తుపూర్వం ఎనిమిదివందల నాటివని తెలుసుకున్నారు ప్రపంచంలోనే దీనిని మొట్టమొదటి లైబ్రరీగా నిర్ధారించారు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం మెసపుటేమియా వారు గుళ్ళలోను రాజ మందిరాలలోను గ్రంథాలయాలను నిర్మించారు ఆ గ్రంథాలు హాల్లో చదునైన రాతిపలకలను పుస్తకాలుగా వాడేవారు ఈజిప్ట్ లోనూ ఇదే విధంగా దేవాలయాలను గ్రంథాలయాలుగా చేసుకుని పాపిరస్ అనే ఆకులతో తయారుచేసిన పత్రాలను వాడేవారు రోమన్లకు లైబ్రరీలంటే ఆసక్తి లేకపోయినా గ్రీకు వారిని చూసి తాము కూడా ప్రారంభించారు ఇప్పటికీ ప్రపంచంలో మొట్టమొదటి అతిపెద్ద లైబ్రరీగా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నో గుర్తించారు దీన్ని ఏప్రిల్ 24 1800 సంవత్సరంలో వాషింగ్టన్ లో స్థాపించారు ఇందులో 162 మిలియన్ల పుస్తకాలు 470 భాషల్లో కలిగి ఉన్నాయి రెండవ అతిపెద్ద లైబ్రరీగా లండన్లోని బ్రిటీష్ లైబ్రరీ 150 మిలియన్ పుస్తకాలు కలిగి ఉందని గుర్తించారు లైబ్రరీ ఆఫ్ చైనా 35 మిలియన్ల పుస్తకాలతో ఆసియా లో మొదటి లైబ్రరీ గా నిలిచింది ఇక కోల్కతలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా 2.2 మిలియన్ల పుస్తకాలతో ఇండియాలో మొదటి పెద్ద లైబ్రరీ గా పేరు గాంచిందిVisit https://9teamcreations.in for more information

Category

📚
Learning

Recommended