GHMC Collapses Nandamuri Taraka Ratna Restaurant | నందమూరి హీరో రెస్టారెంట్ కూల్చివేసిన జీహెచ్ఎంసీ

  • 5 years ago
హైదరాబాద్ నగరంలో పలు బార్ అండ్ రెస్టారెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. కానీ అధికారుల దృష్టికి వెళుతున్నవి కొన్ని మాత్రమే. ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నందమూరి హీరో తారక రత్నకు చెందిన రెస్టారెంట్ ని జిహెచ్ఎంసి అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సోమవారం రోజు జీహెచ్ఎంసీ అధికారులు అకస్మాత్తుగా తారక రత్నకు చెందిన రెస్టారెంట్ పై దాడులు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ బంజారాహిల్స్ రోడ్ నెం 12 లో ఉంది. అధికారులు రెస్టారెంట్ మొత్తాన్ని కూల్చివేశారు. ఈ సమయంలో అధికారులకు, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు ఎవరి మాట వినకుండా వారి విధుల్ని నిర్వహించారు. రెస్టారెంట్ కూల్చివేతకు గురవుతోందని తెలియడంతో తారక రత్న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
#nandamuritarakaratna
#MohanaKrishnaNandamuri
#restaurant
#okatonumberkurradu