• 6 years ago
Cricket has given me everything. When I leave the game, I want to be at my best. I do not want to go with any regret, the 2011 World Cup winning hero said at the Jadavpur University Saltlake Campus ground.
#Cricket
#indiavsAustralia
#YuvrajSingh,
#ICCWorldCup2019
#RanjiTrophy


ఇంగ్లాండ్‌లో నిర్వహించే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కెరీర్‌లో అత్యుత్తమంగా ఆడుతున్నప్పుడే ఆటకు వీడ్కోలు పలకాలని ఆశపడుతున్నట్లు వెల్లడించాడు. బెంగాల్‌ జట్టుతో రంజీ మ్యాచ్ ఆడుతున్న యువీ.. 'క్రికెట్‌ నాకన్నీ ఇచ్చింది. ఆటకు వీడ్కోలు పలికేటప్పుడు అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. బాధతో వెళ్లిపోవద్దు' అని తెలిపాడు. క్రికెట్‌ అన్నీ ఇచ్చింది. ఆటను వీడేటపుడు అత్యుత్తమ దశలో ఉండాలనుకుంటున్నా. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా నిష్క్రమించాలి. ప్రస్తుతం రంజీ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడబోతున్నా. తర్వాత జాతీయ టీ20 టోర్నీలో పాల్గొనాలి. ఆపై ఐపీఎల్‌ ఉంది. అన్నింట్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నా' అని యువీ చెప్పాడు. ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న టీమిండియాపై యువీ ప్రశంసలు కురిపించాడు.

Category

🥇
Sports

Recommended