• 6 years ago
Sachin Tendulkar paid a heartfelt tribute to his coach Ramakant Achrekar. Achrekar, who breathed his last in Mumbai due to age-related complications, had also coached other names in Indian cricket such as Vinod Kambli, Pravin Amre, Sameer Dighe and Balwinder Singh Sandhu.

ద్రోణాచార్య అవార్డు గ్రహీత, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌‌ (87) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 'ఆయన (అచ్రేకర్‌ సర్‌) మనకిక లేరు. ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు' అని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ముంబైలో దాదార్‌లోని శివాజీరాజ్ పార్కులో రమాకాంత్‌ ఎందరో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవారు. లెజండరీ క్రికెట్‌ కోచ్‌గా పేరుగాంచిన అచ్రేకర్‌ వినోద్‌ కాంబ్లి, ప్రవీన్‌ ఆమ్రె, సమీర్‌ దిఘె, బల్విందర్‌ సింగ్‌ సంధు, అజిత్‌ అగార్కర్‌ వంటి క్రికెటర్లకు క్రికెటర్లను తీర్చిదిద్దారు. ఆయనకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది మాత్రం సచిన్ టెండూల్కరే.
#RamakantAchrekar
#SachinTendulkar
#VinodKambli
#SachinTendulkarcoach
#Indiancricket

Category

🥇
Sports

Recommended