మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ రేవ్ పార్టీలో మరోకోణం బయటపడింది. హైదరాబాద్ లోని ప్రముఖ ఫార్మాకంపెనీలు వ్యాపార అభివృద్ది కోసం అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. తమ కంపెనీ బ్రాండ్ ప్రమోట్ చేయాలంటూ.. డాక్టర్లకు అమ్మాయిలను సప్లై చేసినట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీల చర్యలతో పోలీసులు విస్మయానికి గురవుతున్నారు. ఇక నిన్నఅర్థరాత్రి సెలబ్రెటీ రిసార్ట్ పై దాడులు చేసిన స్పెషల్ పార్టీ పోలీసులు ఏడుగురు డాక్టర్లు,నలుగురు యువతులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది.
Category
🗞
News