Anushka Shetty To Play Simbu's Pair In VTV 2

  • 6 years ago
Anushka Shetty pairing with Simbu in Gautham Menon film VTV2. Vinnaithaandi Varuvaaya was a sensational hit for menon. Now he is planning to make sequel to VTV. Shimbu is the hero, Anushka Shetty is lead for this movie. Soon this will go on to sets.

బాహుబలి, భాగమతి చిత్రం తర్వాత అనుష్క పెళ్లి వార్తనే మీడియాలో వైరల్ అయింది. ఇక ఆమె నటించే చిత్రాల విషయాలను జనం మరిచిపోయారు. తాజాగా పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి తమిళ చిత్రంలో నటించేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు.
గౌతమ్ మీనన్ కెరీర్‌లో విన్నైతాండి వరువాయ ( వీటీవీ) చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో ఏం మాయ చేశావే సినిమాగా రూపొందిన విషయం తెలిసిందే. శింబు, త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టింది. త్రిషా, శింబు కెమిస్ట్రీ ఈ చిత్రంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అలాంటి వీటీవీ చిత్రానికి సీక్వెల్‌గా మరో చిత్రాన్ని రూపొందించే పనిలో గౌతమ్ ఉన్నారు.
వీటీవీ2 చిత్రం కోసం శింబును హీరోగా ఎంపిక చేశారు. శింబు పక్కన దేవసేన అనుష్కను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ చిత్రంలో శింబు, అనుష్క మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండించే విధంగా సీన్లు ఉంటాయనేది చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Recommended