సెక్రటేరియట్ లో పని...కానీ కనీస వేతనానికి దిక్కులేదు

  • 6 years ago
పేరు గొప్ప...ఊరు దిబ్బ అనే సామెత అక్షరాలా అతికినట్లు సరిపోతుంది ఆ చిరుద్యోగుల జీవితాలకు...ఎలాగంటే?...వీళ్లు పనిచేసేది సాక్షాత్తూ రాష్ట్ర పరిపాలనను శాసించే సచివాలయంలో...కానీ కష్టాలు చూస్తే కూలీకి వెళ్లే వాళ్లకంటే ఎక్కువ!...ఇంతకూ వీళ్లెవరంటే...ఎపి సెక్రటేరియట్లో హౌస్ కీపింగ్ ఉద్యోగులు... రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వ శాసనాధిపతులు,పాలనాధికారులు కొలువై ఉండే అంతటి కీలక ప్రదేశంలో ఉద్యోగం చేస్తూ కూడా...వీళ్లు కనీసం వేతనానికే కాదు...కొన్నిసార్లు అసలు వేతనానికే నోచుకోవడం లేదంటే వీళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిపాలన మూలాలు ఆరంభమయ్యే ఆ భవనంలోనే...శాసనాధిపతులకు నెలవైన ఆ ప్రదేశంలోనే ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం...మన వ్యవస్థలో లోపాన్ని తేటతెల్లం చేస్తోంది.

The housekeeping staff of AP Secretariat have facing minimum wage and monthly salary problems.
#amaravati
#secretariat
#andhrapradesh
#housekeeping