Ganguly Comments On Dhoni World Cup Career

  • 6 years ago
వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని మహీ తన ఆటతీరు మార్చుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ సూచించాడు. ప్రస్తుత భారత్ జట్టులో ప్రతిభ ఆధారంగానే ప్లేయర్లను తీసుకునే విషయాన్ని గుర్తు చేశాడు. ఇదే స్థాయి ప్రదర్శనను కొనసాగిస్తే ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కడం సందేహమేనని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా ధోనీ.. ఏడాదిగా పరిమిత ఓవర్లలో రాణించలేకపోవడాన్ని గుర్తు చేశాడు.
2019 ప్రపంచ కప్‌లోనూ ధోనీ ఆడాలని మేనేజ్‌మెంట్‌ అనుకుంటే అతడు సత్తా చూపే స్థానంలోనే ఆడించాలి. 24-25 ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన తరుణంలో అతడు విఫలమవుతున్నాడు. ధోనీ గొప్ప బ్యాట్స్‌మన్‌. కానీ ఏడాదిగా అతడు రాణించలేకపోతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఆటలో లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరముంది' అని గంగూలీ వ్యాఖ్యానించాడు.

Recommended