పడవ ప్రమాదాలపై బాబు ఆందోళన

  • 6 years ago
జిల్లాలోని సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలో వంశధార నదిలో చిక్కుకుపోయిన 53 మందిని సహాయ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. వంశధార నదీ గర్భంలో ఇసుకను తోడేందుకు వెళ్లిన కూలీలు, డ్రైవర్లు వరద కారణంగా అక్కడే చిక్కుకుపోయారు.
ఒక్కసారిగా వంశధార నదిలో వరద ప్రవాహం అధికం కావడంతో వీరంతా చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు సహాయచర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది చాలా సమయం పాటు శ్రమించి వారిందర్నీ ఒడ్డుకు చేర్చారు. బాధితులంతా క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.