హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న జీవితా-రాజశేఖర్‌

  • 6 years ago
jeevitha rajasekhar family participates in haritha haram on bhalf of shivani birthday


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జీవితా-రాజశేఖర్‌ కుటుంబం పాల్పంచుకుంది. ఆదివారం (జులై 1) తమ కూతురు శివాని పుట్టిన రోజు సందర్భంగా జీవిత, రాజశేఖర్ దంపతులు మొక్కలు నాటారు. హైదరాబాద్‌ శివార్లలోని కండ్లకోయ ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద జీవిత, రాజశేఖర్‌‌తో పాటు కుమార్తెలు శివాని, శివాత్మిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హరితహారం కార్యక్రమంపై జీవిత ప్రశంసలు కురిపించారు. కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారం కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

Recommended