India VS Ireland Match Highlights

  • 6 years ago
India beat Ireland by 76 runs in the first T20I match in Dublin.Chahal removes Garry Wilson on the score of 5.Dhawan dances down the ground off the final ball from Chase and the ball ends over the fence.
#india
#ireland
#cricket
#viratkohli
#shikhardhawan
#rohitsharma
#msdhoni

షార్ట్ ఫార్మాట్‌లో కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశ్యంలో.. సమాయత్తమైన టీమిండియా.. ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా తలపడింది. ఏకపక్షంగా సాగిన పోరులో అనుకున్నట్లుగానే విజేతగా టీమిండియానే నిలిచింది. ముందుగానే ఊహించినా.. సునాయాసంగా జట్టును అప్పగించేసి ఊరకుండిపోయింది ఐర్లాండ్.
208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను 132/9కే పరిమితం చేసింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఏ దశలోనూ భారత్‌కి పోటీనివ్వలేకపోయింది. ఓపెనర్ జేమ్స్ (60: 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు. కాసేపు క్రీజులో నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. కుల్దీప్ అతడ్ని బోల్తా కొట్టించడంతో ఐర్లాండ్‌ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది.