World selfie Day : Icc Plans For Selfie with Favourite Crickter

  • 6 years ago
Icc Tweets About Selfie With your Crickter on behalf of worlds selfi day.

గత నాలుగేళ్లుగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే.
అయితే, జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం మాత్రమే కాదు, సెల్ఫీ ప్రేమికులు ఈ రోజును సెల్ఫీ డేగా (2014 నుంచి) జరుపుకుంటున్నారు. సెల్ఫీ డే సందర్బంగా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కొన్ని ఫోటోలను తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
'మీ అభిమాన క్రికెట్లర్ల సెల్ఫీ ఫోటోలు చూడండి' అంటూ ఐసీసీ ఆ ట్వీట్‌లో కొన్ని ఫోటోలను పోస్టు చేసింది. ఇందులో గతేడాది కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న జట్లతో పాటు, మాజీ దిగ్గజ క్రికెట్లర్లు దిగిన సెల్ఫీ ఫోటోలు ఉన్నాయి.

Recommended