Vishal Supports To Rajini On Kaala Issue

  • 6 years ago
Rajinikanth hopes the Kaala issue in Karnataka gets resolved amicably and the South Indian Film Chamber of Commerce would intervene into the matter. Rajinikanth’s colleagues and admirers have been supporting the superstar in this cause and stating both the issues are different and shouldn’t be interlinked.
#Kaala
#Rajinikanth

రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' చిత్రం జూన్ 7న విడుదలకు సిద్ధమైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగస్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న క్రమంలో కర్నాటకలో ఈ చిత్రం విడుదలను కన్నడిగులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం వివాదాస్పదం అయింది.
కావేరీ జలాల వివాదంలో రజనీకాంత్ గతంలో చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనికి నిరసనగా ‘కాలా' చిత్రాన్ని కర్నాటకలో విడుదల అడ్డుకుంటామని కర్నాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఈ సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల ఓనర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు సూచించింది. పలు కన్నడ సంఘాలు కూడా ‘కాలా' చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
అయితే సినిమా విడుదల సమయానికి ఈ సమస్య స్నేహ పూర్వకంగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో రజనీకాంత్ ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సౌతిండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మూవీ కర్నాటక రిలీజ్ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తోందట.

Recommended