మూడేళ్ల వర్షం ఒకే రోజులో కురిసింది, ముగ్గురు ఇండియన్స్, 13మంది మృతి

  • 6 years ago
ఒమన్: మెకును తుఫాను వల్ల యెమెన్, ఒమన్ దేశాల్లో మృతిచెందిన వారి సంఖ్య 13కు చేరుకుంది. 30మందికిపైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా యెమెన్ ద్వీపం సొకొత్రాలో నివసిస్తున్న యెమెన్, సూడాన్, భారత సంతతి ప్రజలు. కాగా, తుఫాను ధాటికి ఓమన్‌లోని మూడో అతిపెద్ద నగరం సలాలాహ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూగర్భ మార్గాలు చెరువులను తలపిస్తున్నాయి. ఓవైపు వరదలు మరోవైపు కరెంటు లేకపోవడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే ఓమన్‌లోని బీచ్‌లు నిర్మానుష్యంగా మారాయి. సొకొత్రాలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాము ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను గుర్తించామని, అందులో ఇద్దరు భారత నావికులు ఉన్నారని సొకొత్రా గవర్నర్ రాంజీ మెహ్రోజ్ తెలిపారు. Cyclone death toll in Oman, Yemen rises to 13: authorities ఎనిమిది మంది భారత నావికులు గల్లంతయ్యారని పేర్కొన్నారు. అల్ మహ్రా రాష్ట్ర గవర్నర్ రాఘ్హ్ బక్రిత్ ట్వీట్ చేస్తూ సలాలాహ్, దాని పరిసర ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కన్నా అధికం వర్షం కురిసిందని పేర్కొన్నారు. ఒమన్‌లో మూడేళ్లలో కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడం గమనార్హం. వరదల వల్ల నిర్వాసితులుగా మారిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. మరో రెండు రోజులూ వర్షాలుంటా యని సౌదీ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!