IPL 2018: Shardul Thakur Bags a Bad Record

  • 6 years ago
Chennai Super Kings entered their seventh IPL final beating Sunrisers Hyderabad by two wickets at the Wankhede Stadium, Mumbai, on Tuesday (May 22). At one stage, the chase of Super Kings was in tatters losing half of the side, including skipper MS Dhoni, with around 80 runs more required.
#chennaisuperkings
#sunrisershyderabad
#ipl2018

నరాలు తెగిపోయేంత ఉత్కంఠ. ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లేదెవరు? ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిన ప్రత్యర్థి చేతిలో పోరాడి ఓడింది హైదరాబాద్. ఈ విజయం మాత్రం చెన్నై జట్టుకు సునాయాసంగా రాలేదు. క్రిందటి మ్యాచ్ వరకూ ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు ఇరగదీశారు అనుకోవడానికి లేదు. మ్యాచ్ ఆరంభం నుంచి పెద్దగా స్కోరు చేయకుండానే వరుసగా రాలిపోతున్న వికెట్లు.. ఆ దశలో క్రీజులో నిలదొక్కుకున్నాడు డుప్లెసిస్. కానీ, మరో ఎండ్‌లో కూడా అతనికి మంచి భాగస్వామ్యం అందితేనే కదా. పరుగులు చేయగలిగేది.
అలాంటి సందర్భంలో క్రీజులో అడుగుపెట్టాడు శార్ధూల్ ఠాకూర్.. అతనిపై అన్ని నమ్మకాలు లేకపోవడంతో ఆఖర్లో బ్యాటింగ్‌కు పంపాడు ధోనీ. దీంతో అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా 5బంతులకు 15పరుగులు చేశాడు. సిద్ధార్థ్ కౌల్ చేయడంతో 18, 19 ఓవర్లలో భారీ పరుగులు సాధించిన ద్వయం జట్టుకు మంచి విజయాన్నందించింది.
ఒకవేళ ఈ మ్యాచ్‌ చెన్నై జట్టు ఓడిపోయి ఉంటే.. అందరూ శార్దూల్ ఠాకూర్‌ను తీవ్రంగా తిట్టిపోశావారు. ఎందుకంటే టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్.. భారీగా పరుగులు రాబట్టలేకపోయింది. అయినా కూడా శార్దూల్ ఠాకూర్ వేసిన 4 ఓవర్లలో 50పరుగులు వరకూ ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. మ్యాచ్ ముగిసే సమయానికి ఠాకూర్ 12.5 యావరేజితో ఉంటే, హైదరాబాద్ జట్టు 139పరుగులకు కేవలం 7 సగటుతో ముగించింది.

Recommended