Queen Movie Will Be directed By Prashanth Varma

  • 6 years ago
Film Nagar source said that, Prasanth Varma to handle Queen south remake. Initially, director Neelakanta backed out from the project and now the movie reportedly went into the hands of 'Awe!' director Prasanth Varma.

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కిన 'క్వీన్' చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఈ హాట్ బ్యూటీ కెరీర్ మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది. త్వరలో ఈ మూవీ సౌత్‌ బాషల్లో రీమేక్ కాబోతోంది. తమన్నా ప్రధాన పాత్రలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రీమేక్ చేయబోతున్నారు.
ఈ సినిమాకు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాలతో ఈ సినిమా ముందుకు సాగలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'అ' ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
అ' సినిమా ద్వారా దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టోరీ టెల్లింగ్ విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు. 'క్వీన్' లాంటి సబ్జెక్టును అతడు బాగా హ్యాండిల్ చేయగలడన్న నమ్మకానికి వచ్చిన నిర్మాతలు త్వరలోనే ఈ విషయాన్ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట.
ఈ చిత్రాన్ని తమన్నా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేయడంపై ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే క్వీన్ తెలుగు రీమేక్ మన ముందుకు రాబోతోంది.

Recommended