Naa peru Surya Movie Has Shocking News

  • 6 years ago
Pawan Kalyan issue effect on Naa Peru Surya. Source said that, There are political reasons behind these developments.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' సినిమా మే 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన కొన్ని పరిణామాలతో ఈ సినిమా స్పెషల్ షోల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో సమస్య ఏర్పడే అవకాశం ఉందని, స్పెషల్ షోలు ఉండే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది. అయితే స్పెషల్ షోస్ కోసం ప్రయత్నాలైతే జరుగుతున్నట్లు సమాచారం.
ఇంతకు ముందు విడుదలైన ‘రంగస్థలం', ‘భరత్ అనే నేను' చిత్రాలకు ఏపీలో స్పెషల్ షోల కోసం పర్మిషన్ ఇచ్చారు. ‘రంగస్థలం' చిత్రానికి మార్చి 30 నుండి ఏప్రిల్ 5 వరకు, ‘భరత్ అనే నేను' చిత్రానికి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27 వరకు తెల్లవారు ఝామున 5 గంటల నుండి 10 గంటల మధ్య స్పెషల్ షోస్ వేసుకోవడానికి అనుమతి లభించింది. రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబుకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో మంచి సంబంధాలు ఉండటం వల్లే ఇది సాధ్యమైందని టాక్.
అయితే ‘నా పేరు సూర్య' విషయంలో ఇది సాధ్యం అయ్యే పని కాదని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన కొన్ని ఇష్యూలు, టీడీపీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీకి మద్దతుగా ఉన్నాయంటూ కొన్ని టీవీ ఛానల్స్ మీద పవన్ కామెంట్స్.... పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ఫిల్మ్ చాంబర్ వెల్లడం లాంటి పరిణామాలు ఇందుకు కారణం అనే వాదన వినిపిస్తోంది.
#naa peru surya
#allu arjun
#anu emmanuel
#vakkantham vamsi

Recommended