కర్ణాటక సీఎం బంధువు ఇంటిలో ఐటీ సోదాలు: రూ. 191 కోట్లు సీజ్

  • 6 years ago
Income Tax officers raided chief minister Siddaramaiah's relative and karnataka minimum wage board president Umesh's house in Chamarajanagar.

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు నిఘా వేశారు. శనివారం కర్ణాటకలోని రెండు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు. సీఎం సిద్దరామయ్య సమీప బంధువు, కర్ణాటక మినిమమ్ వేజ్ బోర్డు) అధ్యక్షుడు ఉమేష్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
చామరాజనగరలోని కోర్టు వీదిలోని ఉమేష్ ఇంటి ముందు శనివారం ప్రత్యక్షం అయిన 14 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు ఉమేష్ ఇంటికి డోర్ లాక్ చేసుకుని సోదాలు చేసి వివిద పత్రాలు పరిశీలిస్తున్నారు. సీఎం సిద్దరామయ్య బంధువు ఉమేష్ శాసన సభ్యుడు పుట్టరంగశెట్టికి చాల సన్నిహితుడు.
కర్ణాటక కనీస వేతనాల సలహా మండలి అధ్యుక్షుడిగా గతంలో ఎం. చిన్నస్వామి ఉన్నారు. అయితే కొన్ని కారణాల వలన ఎం. చిన్నస్వామి బహిరంగంగా సీఎం సిద్దరామయ్యను విమర్శించారు. ఆ సమయంలో సీఎం సిద్దరామయ్య ఎం. చిన్నస్వామిని పదవి నుంచి తప్పించి తన సమీప బంధువు ఉమేష్ ను నియమించారు.
#Income tax
#Karnataka Assembly Elections
#Siddaramaiah
#Raid

Recommended