Chiranjeevi’s Surprise Visit To Naa Peru Surya Set

  • 6 years ago
Chiranjeevi’s surprise visit to Naa Peru Surya set. Allu Arjun and Anu Emmanuel starrer Naa Peru Surya movie directed by Vakkantham Vamsi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నాపేరు సూర్య. ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటూ మే 4 న విడుదలకు సిద్ధం అవుతోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో మిలటరీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.ఆర్మీ మాన్ న్గా బన్నీ లుక్ అభిమానులను పిచ్చెక్కించే విధంగా ఉంది. రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.
అల్లు అర్జున్ కెరీర్ పరంగా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సరైనోడు, డీజే వంటి హిట్స్ బన్నీకి ఇటీవల దక్కాయి.
ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం పరాజయం చెందడంతో అను బన్నీ చిత్రాన్ని నమ్ముకుని ఉంది.
మెగాస్టార్ చిరంజీవి ఆదివారం రోజున అల్లు అర్జున్ ని సర్ ప్రైజ్ చేశాడు. నా పేరు సూర్య సెట్స్ కి వెళ్లి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మెగాస్టార్ రాకతో చిత్ర యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. మెగాస్టార్ విజిట్ కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఊహించని విధంగా మెగాస్టార్ రావడంతో చిత్రయూనిట్ సంతోషంలో మునిగిపోయింది. దాదాపు అర్థ గంట పాటు చిరంజీవి నా పేరు సూర్య చిత్ర సెట్ లో గడిపారట. బన్నీ, దర్శకుడు వంశీ, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలుస్తోంది.