'Naa Peru Surya' New Poster Is Simply Extravagant

  • 6 years ago
Advance birthday wishes for Allu Arjun. Naa Peru Surya movie team releases stunning poster.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. నాపేరు సూర్య చిత్రం వక్కంతం వంశి దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
త్వరలో అల్లు అర్జున్ పుటిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నాడు. ఏప్రిల్ 8 న బన్నీ 35 వ పడిలోకి అడుగుపెడతాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బన్నీని విష్ చేస్తూ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసింది.
ఇటీవల అల్లు అర్జున్ సినీ ప్రవేశం చేసిన 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల క్రితం బన్నీ గంగోత్రి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 15 ఏళ్ళతో బన్నీ నటుడిగా ఎదుగుతూ భారీ క్రేజ్ ఏర్పరుచుకున్నారు.
ఈ చిత్ర ఆడియో వేడుక ఏప్రిల్ 15 న నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఆడియో వేడుక వేదికని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. హైదరాబాద్, వైజాగ్ మరియు తిరుపతి వంటి ప్రధాన నగరాలని పరిశీలిస్తున్నారు.
కుటుంబం కంటే దేశాన్నే ఎక్కువగా ప్రేమించే ఆర్మీ అధికారి కథ ఇది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తన ప్రతి చిత్రంలో కమర్షియల్ అంశాలు ఉంటూనే తన పాత్రలో ప్రత్యేకత ఉండాలని బన్నీ భావిస్తాడు. బన్నీ ముఖంపై ఇండియాలో ప్రధాన నగరాలను పేర్లని పొందుపరిచారు. బోర్డర్ లో ఆర్మీ యాక్షన్ సన్నివేశాలతో పేరు ప్రధాన నగరాలలో మిలటరీ ఆపరేషన్ వంటి సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.