ఓ హంతకుడు బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నాడు : బీజేపీ, కాంగ్రెస్ మధ్య కురుక్షేత్రం

  • 6 years ago
Congress president Rahul Gandhi on Sunday said the fight would be between the Kauravas BJP and Pandavas Congress. the Congress, just like the Pandavas, would fight for the truth.

బీజేపీ, ఆరెస్సెస్ కౌరవుల్లా అధికారం కోసం అర్రులు చాస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. బీజేపీతి ఓ సంస్థ గొంతు అయితే కాంగ్రెస్ పార్టీది దేశం గొంతు అన్నారు.
ఆయన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ముగింపు సందర్భంగా మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్‌లో ఆధునిక యుగంలో కౌరవులు అన్నారు. తాము పాండవుల్లా సత్యం కోసం పోరాడుతున్నామన్నారు. బీజేపీ అసహనాన్ని పెంచి పోషిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ బీజేపీ, ఆరెస్సెస్‌ల వలె ప్రవర్తించలేదన్నారు. కాంగ్రెస్ నిజాయితీ కోసం పని చేస్తోందన్నారు. ఓ హంతకుడు బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెట్టుకుందన్నారు.
బిజెపిపై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరైతే రాముడి ఉనికిని ప్రశ్నించారో.. ఇప్పుడు ఆ పార్టీయే పాండవులతో గుర్తింపు పొందాలని చూస్తోందన్నారు. హిందువులను, విశ్వాసాలను ఎగతాళి చేసిన పార్టీ ఇప్పుడు హిందూ దేవతల గురించి మాట్లాడడాన్ని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
సాంకేతికను కూడ ఇష్టపడని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. పారదర్శకతను కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడ నమ్మదని చెప్పారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తన తండ్రి, నానమ్మ కాలంలో మీడియాపై విధించిన ఆంక్షలను గుర్తుంచుకోవాలని సూచించారు