Getup Seenu Shocking Comments On Hyper Aadhi

  • 6 years ago
Getup Srinu About Hyper Aadhi. He said Aadhi is number one at his punches while Chandra is number one in family skits and whereas Rakesh is number one in his own style with children. Srinu said, 'We are number one in our own skit'. Jabardasth has become a success as each team has a unique style.

తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ షో సక్సెస్ అయినంతగా ఏ కామెడీ షో హిట్ కాలేదు.
ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలలో బాగా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. అతి తక్కువకాలంలోనే ఆది టాప్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు.
ఆది వచ్చిన తర్వాత జబర్దస్త్‌లోని మిగతా టీమ్స్ అన్నీ రేటింగ్స్ పరంగా, యూట్యూబ్ వ్యూస్ పరంగా డీలా పడిపోయాయి. ఆది ఎంటర్టెన్ చేసినంతగా ఎవరూ చేయడం లేదనే ఓ వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హూపర్ ఆది ప్రస్తావన రాగా జబర్దస్త్ గెటప్ శ్రీను సీరియస్‌గా సమాధానం ఇచ్చారు.
ఆది వచ్చిన తర్వాత మా షో వ్యూస్ తగ్గిపోయాయి అనడం సరికాదు. మాది ఏమాత్రం తగ్గలేదు. ఆది స్కిట్ వ్యూస్ పెరిగాయి. మాషోను ఆది రాకముందు 10 లక్షల మంది చూసేవారు. తనకు 30 లక్షల మంది, 40 లక్షల మంది చూస్తున్నారు. మాది లేడీ గెటప్ వేసుకుంటే 60 లక్షలు చూశారు. 70 లక్షలు రీచ్ అయిన స్కిట్లు కూడా ఉన్నాయి. తనవి ఎక్కువ ఉంటున్నాయే తప్ప మాది తగ్గలేదు అని గెటప్ శ్రీను తెలిపారు.
తను చేస్తున్న పంచ్ స్కిట్లలో తాను నెం.1.... మేము చేసే బిజినెస్ స్కిట్లలో మేము నెం1..... ఎవరి స్కిట్లు వారి వారి స్టైల్ లో వారు నెం.1...... అని గెటప్ శ్రీను చెప్పుకొచ్చాడు
ఇపుడు ఆది లాగే మేము పంచ్ వేయాలనుకుంటే ఆదికి మాకు తేడా ఉండదు. . ఒక్కొక్కరు ఒక్కోరకమైన వేరియేషన్‌తో ఉన్నాం కాబట్టే జబర్దస్త్ ఇంత సక్సెస్ అయింది.... అని గెటప్ శ్రీను తెలిపారు.
ఎవరైనా మా స్కిట్లలో ఊపు తగ్గిపోయింది అనే వరకు వచ్చారంటే.... వారు ఆది స్కిట్లను అంత ఇష్టపడుతున్నారని అర్థం. అంతే కానీ మనల్ని దూరం చేస్తున్నారని అర్థం కాదు అని గెటప్ శ్రీను తెలిపారు.