Allu Arjun's New Look

  • 6 years ago
Allu Arjun is oozing a lot of swag in the latest poster of his upcoming film, Naa Peru Surya, which has been dropped today. In the photo that was shared by Allu Shirish on his Twitter account, we see him with his shades on, smoking a cigar as he drives a big mean machine. And that cut in his eyebrow which is a part of the look of this film is certainly unmissable.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకు పరిణితి కనబరుస్తూ అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఇప్పటికే రిలీజైన టీజర్, తదితర పోస్టర్లతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ట్వీట్ చేసిన ఓ పోస్టర్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్ భీభత్సంగా ఉంది. నోట్లో సిగార్ పెట్టుకొని తీవ్రమైన లుక్స్‌తోఅదరగొట్టాడు. ఇక మిలటిరీ కటింగ్‌తో జీపులో కూర్చొని ఉన్న స్టైలిష్ స్టార్ బాడీ హాలీవుడ్ హీరో ధీటుగా కనిపించింది.
నా పేరు సూర్య కోసం అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ద పెట్టి బాడీ బిల్డింగ్ చేశాడు. కండలు తిరిగిన చేయి ఫ్యాన్స్‌కు కేక పుట్టించేలా ఉంది. మిలటరీ ఆఫీసర్ అంటే ఇలానే ఉంటాడు అనే విధంగా అల్లు అర్జున్ తన బాడీని సరిదిద్దుకొన్నాడు దీనికోసం అమెరికాలో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఈ పాత్ర కోసం విపరీతంగా శ్రమ పడినట్టు చిత్ర యూనిట్ పేర్కొంటున్నది.
కథ, మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకత్వం బాధ్యతలు చేపట్టి నా పేరు సూర్య అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. శిరీష రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌పై లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నా పేరు సూర్య చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే అదే రోజు రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం రిలీజ్ కానుండటంతో రిలీజ్ డేట్‌ను మార్చుకొన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర విడుదలను ఏప్రిల్ 20 తేదీగా నిర్ణయించారు.