Virat Kohli's 'Over Aggression' in South Africa Tour

  • 6 years ago
Virat Kohli's aggression was a "little over the top" in the recent tour of South Africa but it is all part of his development as a India captain, says former Australia skipper Steve Waugh.

ఇటీవల ముగిసిన సఫారీ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్తంత ఎక్కువ దూకుడినే ప్రదర్శించాడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీని చూశాను. కెప్టెన్‌గా కోహ్లీ అతి చేశాడని అనిపించింది. అయితే, అతడు ప్రస్తుతం నేర్చుకునే దశలో ఉన్నాడు" అని లారస్ వరల్డ్ స్పో అవార్డుల కార్యక్రమంలో అన్నాడు. కోహ్లీలాగా జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా దూకుడుగా వ్యవహారించే స్వేచ్ఛ కోహ్లీ ఇచ్చినట్లు లేడని స్టీవ్ వా తెలిపాడు.
గొప్ప కెప్టెన్‌గా ఎదిగేందుకు కోహ్లీకి ఇంకా సమయం పడుతుంది. ముఖ్యంగా మైదానంలో ఆడే సమయంలో ఎమోషన్స్‌ని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. జట్టులోని ఆటగాళ్లు అందరూ తన లాగే ఒకే పద్ధతిలో ఆడలేరన్న విషయం గ్రహించాలి. రహానే, పుజారాలు చాలా నెమ్మదిగా ఉంటారు. కొందరు ఆటగాళ్లు భిన్నంగా ఉంటారనే విషయం కోహ్లీ గ్రహించాలి' అని పేర్కొన్నాడు.
'అన్ని సార్లు ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం కుదరదు. కానీ, ప్రస్తుతం జట్టుని నడిపిస్తున్న తీరు అద్భుతం. అందుకే జట్టులోని ఆటగాళ్లు అంతా కోహ్లీనే ఫాలో అవుతున్నారు. అన్ని సందర్భాల్లో కూడా జట్టు సమిష్టిగా పోరాడి విజయం సాధించాలని కోరుకుంటున్నాడు' అని చెప్పాడు.
ఈ ఏడాది చివర్లో కోహ్లీసేన ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యనటలతో రెండు అతిపెద్ద ఛాలెంజ్‌లు ఉన్నాయి. ఈ పర్యటనల్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను, ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆడనుంది.
'ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా ఫేవరేట్‌గా ఉంటుంది. ఎందుకంటే స్వదేశంలో ఇండియా ఎలాగైతే బలమైన జట్టో అదే విధంగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత విజయాల్లో కోహ్లీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. గత ఆసీస్ పర్యటనలో కోహ్లీ అద్భుతంగా రాణించాడు' అని స్టీవ్ వా వెల్లడించాడు.

Recommended