శ్రీదేవి మరణంపై.. టాలీవుడ్ ప్రముఖుల దిగ్బ్రాంతి !

  • 6 years ago
"I have been trying all morning to gather myself to face the truth of dear sridevi leaving us,trying to believe it’s just a bad dream/memories of her just keep coming back and I don’t know whether to smile or cry. We love you dear Sridevi." Nagarjuna said.

ఒకప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి కేలం 54 ఏళ్ల వయసులో అర్దాయుష్షుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులు, ఆమెతో కలిసి పని చేసిన నటీనటులను విషాదంలోకి నెట్టి వేసింది. శ్రీదేవితో కలిసి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, బాలకృష్ణ తదితరులు ఆమె హఠాన్మరణంపై స్పందించారు. తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ...
శ్రీదేవి మనల్ని విడిచిపెట్టిన సత్యాన్ని ఎదుర్కొనేందుకు నేను ఉదయం అంతా ప్రయత్నిస్తున్నాను. దానిని కేవలం ఒక పీడకలగా భావిస్తాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.... అని నాగార్జున వ్యాఖ్యానించారు.
శ్రీదేవిగారితో నాన్నగారు చాలా సినిమాల్లో నటించారు. ఎలాంటి భావాన్నైనా కళ్ళతోనే పలికించగల మహానటి శ్రీదేవిగారు. ఆవిడ హటాన్మరణం చిత్రసీమకు తీరని లోటు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని వేడుకొంటున్నాను.... అని బాలయ్య అన్నారు.
శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు... అటువంటి మంచి మనిషి, అద్భుతమైన నటి నేడు మన మధ్య లేదు అన్న చేదు నిజాన్ని దిగమింగడం చాలా కష్టంగా ఉంది... నిర్మాత ఏఎం రత్నం అన్నారు.
శ్రీదేవి ఇక లేరనే విషయం నన్ను విషాదంలోకి నెట్టి వేసింది... ఆమెతో కలిసి నటించిన ‘క్షణక్షణం' నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... అని వెంకటేష్ తెలిపారు.

Recommended