India's Richest CMs : Chandrababu on Top, No BJP CMs

  • 6 years ago
The Association for Democratic Reform (ADR) released report on India’s 31 Chief Ministers, which also included the wealth held by each of them. Andhra Pradesh Chief Minister Chandrababu Naidu topped the list of wealthiest CMs with assets valued at over Rs 177 crore.

దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 25 మంది (81 శాతం) కోటీశ్వరులేనని ఒక సర్వే నివేదిక విడుదల చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు తెలిపింది.
ఇక దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో 35 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 85 శాతం మంది కోటీశ్వర్లు ఉన్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించాయి. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఆ సంస్థలు విశ్లేషణ జరిపి వివరాలను వెల్లడించాయి. రాష్ట్ర శాసనసభలు, కేంద్ర పాలిత ముఖ్యమంత్రుల వివరాలను విశ్లేషించాయి.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది అంటే 35 శాతం మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎడిఆర్ నివేదిక వెల్లడించింది. ఈ కేసుల్లో 26 మందిపై నమోదైనవి తీవ్రమైన కేసులు. హత్య, హత్యాప్రయత్నం, మోసం, తదితర కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌పై అత్యధిక కేసులు నమోదయ్యాయి
దేశంలోని 25 మంది ముఖ్యమంత్రులు కోటీశ్వర్లు. అంటే 81 శాతం మంది కోటీశ్వర్లు.. వారిలో ఇద్దరి ఆస్తుల విలువ వంద కోట్లకు పైగా ఉంది. ముఖ్యమంత్రుల సగటు ఆస్తుల విలువ రూ. 1618 కోట్లు. అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 15.15 కోట్లని ఏడీఆర్ తెలిపింది. రూ. 14.50 కోట్లతో మేఘాలయా సీఎం ముకుల్ సంగ్మా ఐదో స్థానంలో నిలిచారు.
దేశంలోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు