విద్యార్థిని ఆత్మహత్య, ఫీజు కట్టలేదని అలా !

  • 6 years ago
The Class 9 student was called out and made to stand out of the classroom for not paying the school fee of Rs 2,000. after that 14-year-old student from Hyderabad, who lost life herself from the ceiling fan of her home after her school punished her for non-payment of fees.

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఫీజు చెల్లించకపోవడంతో పాఠశాల యాజమాన్యం ఆమెను పరీక్ష రాయనీయలేదు. దాంతో మనస్తాపానికి గురైన తొమ్మిదో తరగతి విద్యార్థిని సాయి దీప్తి ఆత్మహత్య చేసుకుంది. గురువారం సాయంత్రం మల్కాజిగిరిలోని తమ ఇంట్లో సాయి దీప్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనను పరీక్ష రాయనీయకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో తెలిపింది.
"వాళ్లు నన్ను పరీక్ష రాయనీయలేదు. సారీ మామ్" అని అందులో రాసింది. ఫీజు చెల్లించకపోవడంతో తనను తరగతి గది బయట నిలబెట్టారని సాయిదీప్తి ఇంటికి వచ్చిన తర్వాత తన సోదరికి చెప్పింది. ఇతర విద్యార్థుల ముందు ఫీజు కట్టలేదని టీచర్ తనను అవమానించారని తనతో చెప్పినట్లు సాయి దీప్తి అక్క చెప్పింది. పాఠశాలలో జరిగిన అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె అన్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలల హక్కుల సంఘం అధికారులు మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి బాధ్యత పాఠశాల యాజమాన్యం దే అని మండిపడ్డారు. కేవలం 2000 రూపాయల కోసం ఈ విధంగా చెయ్యాల్సిన అవసరం ఏముందని మండిపడుతున్నారు. పరీక్ష రాసిన తర్వాత ఫీజ్ కట్టించుకుంటే వచ్చిన నస్టం ఏంటని ప్రస్నిస్తున్నారు. ఫీజ్ కట్టలేదని తరగతి గది బయట నిలబెట్టడం, పరీక్ష రాయనివ్వకపోవడం అమానుషం అన్నారు. ఇంకోసారి ఏ పాఠశాల యాజమాన్యం ఇలాంటి తప్పులు చెయ్యకుండా ఉండేలా, చేయ్యాలంటే బయపడేలా పాఠశాల యాజమాన్యం కు శిక్ష వెయ్యాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Recommended