ఎవరు ముందు ? ఇదీ డీల్..!

  • 6 years ago
A deal has fixed between Hero's Allu Arjun&Mahesh Babu regarding their upcoming movies release dates. They are planning to release movies atleast two weeks gap to each other.

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే నిర్మాతలకు ఎక్కడలేని భయం. థియేటర్ల విషయంలో తలెత్తే సమస్య ఒకటైతే.. రెండింటిలో దేనికి కాస్త డివైడ్ టాక్ వచ్చినా ఇక ఆ సినిమా అటకెక్కేయడం ఖాయం. కాబట్టి నిర్మాతలు కూర్చొని మాట్లాడుకుని కొద్ది వారాల గ్యాప్ తో రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు విషయాని వస్తే అల్లు అర్జున్ సినిమా 'నా పేరు సూర్య'ను ఏప్రిల్ 27నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అదే టైమ్‌లో మహేష్ బాబు 'భరత్ అనే నేను' కూడా రాబోతోంది. నిజానికి మహేష్ సినిమా సంక్రాంతికే రావాల్సి ఉన్నా.. ఎందుకనో వాయిదా పడింది. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకే రిలీజ్ డేట్‌తో వస్తే కష్టమని ఇరు సినిమాల నిర్మాతల ఆందోళన చెందుతున్నారు. నా పేరు సూర్య, భరత్ అనే నేను సినిమాలపై దాదాపు రూ.200కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లు టాక్. ఇంత భారీ బిజినెస్ జరిగిన సినిమాలు పోటీ లేకుండా దిగితేనే కలెక్షన్లు భారీగా రాబట్టగలవు. ఒకవేళ పోటీ ఉంటే మాత్రం.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప కలెక్షన్లపై ఎఫెక్ట్ తప్పదు అనే పరిస్థితి.