చైనాకు ఇండియా షాక్.. ఇక టార్గెట్ ఇదే !

  • 6 years ago
India tested a long-range ballistic missile capable of carrying nuclear weapons on Thursday, paving the way for membership to a small list of countries with access to intercontinental missiles and putting most of China in its reach.

అగ్ని -5 క్షిపణిని భారత్ విజయవంతంగా జనవరి 18వ, తేదిన ప్రయోగించింది.ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చైనాలో వనుకు పుడుతోంది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడ ఈ క్షిపణి ధ్వంసం చేసే శక్తి ఉంది. ఖండాతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ క్లబ్‌లో ఇండియా చేరింది.
చైనా ఇటీవల కాలంలో ఇండియాను లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతోంది. ఇండియాకు వ్యతిరేకంగా అవకాశాలను వాడుకొంటుంది. అదే సమయంలో పాకిస్థాన్‌కు చైనా అన్ని రకాలుగా సహయ సహకారాలను అందిస్తోంది.
ఇండియా సరిహద్దు వెంట చైనా ఆర్మీ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. సియాచిన్, డోక్లామ్ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చైనా పూనుకొంది. శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.
అగ్ని -5 విజయవంతం కావడంతో చైనాలో వణుకు మొదలైందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 18వ, తేదిన ఈ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడ ఈ క్షిపణి ధ్వంసం చేయనుంది.
ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో ఇండియా పరిధిలోకి ఆసియా ఖండం మొత్తం వచ్చింది. యూరప్‌లోని 70 శాతం భూభాగం వచ్చి చేరుతోందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చైనాలోని ఉత్తరప్రాంతం మొత్తం ఇప్పడు భారత్‌ క్షిపణి పరిధిలోకి వచ్చేస్తోంది.