వైరల్ అవుతున్న మహేష్ బాబు.. హాలిడే ట్రిప్ ఫోటోస్ !

  • 6 years ago
Mahesh goes on vacations whenever he gets a break from his shootings. Recently, he celebrated the New Year grandly in Oman. He also went to paragliding there. Mahesh as well as his son Gautham also tried the paragliding enthusiastically.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఒమన్ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లిన మహేష్ కుటుంబం న్యూ ఇయర్ వేడుకలు ముగిసిన అనంతరం అక్కడి అందమైన పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తున్నారు. ఈ ట్రిప్పుకు సంబంధించిన ఫోటోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.
ఒమన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన జిగ్గీ బేలో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ గడిపారు. ఇక్కడి కొండ ప్రాంతాల్లో ప్యారా గ్లైడింగ్ చేస్తూ గాల్లో చక్కర్లు కొట్టారు. ఈ ఫోటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
సాధారణంగా గౌతమ్ వయసు పిల్లలు ప్యారా గ్లైడింగ్ లాంటివి చేయడానికి భయపడతారు. అయితే గౌతమ్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్యారా గ్లైడింగ్ చేశారు. ప్యారాగ్లైడింగ్ నిపుణుల సమక్షంలో మహేష్ బాబు, గౌతం ఈ సాహసం చేశారు.
గౌతమ్ తొలిసారిగా ప్యారా గ్లైడింగ్ చేయడంతో.... తన కొడుకు ఎదుగుదలను చూసి తల్లిగా నమ్రత మురిసి పోయింది. ‘గౌతమ్ ఫస్ట్ ప్యారాగ్లైడ్. మై లిటిల్ బేబీ ఆల్ గ్రో అప్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు.

Recommended