2018లో మీ భార్య, గర్ల్ ఫ్రెండ్.. మీతో ఇలా మెలుగుతారు..

  • 6 years ago
This Year Love horoscope

మీ రాశి ప్రకారం 2018లో మీరు మీ జీవిత భాగస్వామి(భార్య లేదా భర్త) తో లేదా మీ గర్ల్ ఫ్రెండ్ తో ఎలా ఉంటారనే విషయాలను తెలుసుకోవొచ్చు. మీ భార్యతో 2017లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. అలాగే మీ గర్ల్ ఫ్రెండ్ మీ ప్రేమను అంగీకరించకపోయి ఉండొచ్చు. 2018లో కూడా ఇలాంటి ఇబ్బందులనే మీరు అనుభవించనున్నారా లేదంటే మీరు కోరుకున్న అమ్మాయితో ఆనందంగా ఉండనున్నారా అనే విషయాల్ని తెలుసుకోండి.
మేషం 2018లో మీరు మీ జీవిత భాగస్వామి(భార్య లేదా భర్త) తో మీరు ఆనందంగా ఉంటారు. ఒకవేళ పెళ్లి కాకపోయి ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ తో 2018లో సంతోషంగా ఉంటారు. అయితే అప్పుడప్పడు మీ పార్టనర్ తో చిన్నచిన్న సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ విషయంలో మీరు తొందరపడి మాట జారకండి. ఎలాంటి తగదాలు పెట్టుకోకండి. ఎందుకంటే మీ జీవితంలో చిన్నగా మొదలయ్యే గొడవలే తర్వాత పెద్దగా మారే అవకాశం ఉంది.
వృషభం 2018 మీకు చాలా సంతోషాలు తీసుకురానుంది. మీరు మీ భాగస్వామిని ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత మంచిది. అయితే 2018 ప్రారంభంలో మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవొచ్చు. తర్వాత మీ సంసారపరంగా ఎలాంటి ఇబ్బందులుండవు. అలాగే పెళ్లికాని వారు గర్ల్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.
మిథునం 2018లో మీ భార్య మీకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఆమెతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక పెళ్లి కానీ వారికి వారు కోరుకున్న అమ్మాయితో పెళ్లి అయ్యే అవకాశం ఉంది. మీరు 2017లో మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యతో కాస్త ఇబ్బందులుపడి ఉండొచ్చు. కానీ 2018 మాత్రం మీరు సంతోషంగా ఉంటారు.
కర్కాటకం 2017లో మీరు మీ భాగస్వామితో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అయితే 2018లో మాత్రం మొత్తం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీకు నచ్చినట్లుగానే మీ జీవిత భాగస్వామి వ్యవహరిస్తుంది. అంతేకాదు మీ భార్య మీరు కోరుకుంటున్న చాలా కోరికల్ని త్వరలో నెరవేర్చనుంది.

Recommended