కమెడియన్ విజయ్ భార్య వనితారెడ్డి సెల్ఫీ వీడియో, హెచ్ ఐవి పరీక్షలు కూడా ?

  • 7 years ago
The moment after Vijay Sai's lost life, his father and Vijay's wife Vanitha blaming each other.telugu cinema actor Vijay sai wife Vanitha reddy released a selfi video on Tuesday night

తప్పు చేస్తే.. ఆ తప్పుకు శిక్షను అనుభవిస్తానని సినీ నటుడు విజయ్ సాయి సతీమణి వనితారెడ్డి ప్రకటించారు. మంగళవారం రాత్రి సెల్పీ వీడియోను విడుదల చేశారు. విజయ్ సాయి మరణంపై వస్తున్న ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు.
తెలుగు సినీ నటుడు విజయ్ సాయి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ ఘటనపై వనితారెడ్డిపై విజయ్ సాయి కుటుంబసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే వనితారెడ్డి కూడ విజయ్ సాయి కుటుంబంపై ప్రత్యారోపణలు చేస్తోంది. మీడియాలో ప్రసారమౌతున్న కథనాలపై వనితారెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. తాను తప్పు చేస్తే శిక్షను అనుభవిస్తానని ఆమె అభిప్రాయపడింది.
తనపై ఆరోపణలు చేసే వారంతా తన బిడ్డ భవిష్యత్ గురించి ఆలోచించాలని ఆమె హితవు పలికారు. కోర్టులో వాస్తవాలు తేలుతాయని తొందరపడి నిందలు వేయకూడదని వనితారెడ్డి కోరారు. తనను బలిపశువును చేయడానికి విజయ్ తండ్రి సుబ్బారావు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తన కూతురుతో కలిసి ఏడుస్తూ తన ఆవేదనను వనితా రెడ్డి ఆ వీడియోలో పోస్ట్ చేశారు. విజయ్ సాయి చనిపోయే ముందు వనితారెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై వనితారెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయ్ ఆత్మహత్య చేసుకొనే సమయంలో తనపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. విజయ్ పిరికివాడనుకోలేదని వనితారెడ్డి అభిప్రాయపడ్డారు. విజయ్ ఆత్మహత్య చేసుకొంటాడని తాను అనుకోలేదని ఆమె ఆ వీడియోలో అభిప్రాయపడ్డారు