వాళ్లను చెప్పుతో కొట్టాలి.. -పవన్ కల్యాణ్

  • 6 years ago
Pawan Kalyan started Jana sena strengthen program. He met fans at Vizag on December 6th. He speaks about Satyagrahi movie, Chiranjeevi politcs and other things.

జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నడుం కట్టారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో బుధవారం ఆయన పర్యటిస్తున్నారు. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఆవేశంగా మాట్లాడారు.
ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమాన్ని కాలరాస్తున్న ప్రభుత్వాలపై పోరాటం చేసే అంశాలతో సత్యాగ్రహి అనే కథ రాసుకొన్నాను. కానీ సినిమాగా తీయకూడదు అని అనుకొన్నాను. నేను ఓ సత్యాగ్రహి కాకూడదు అని అనుకొన్నాను.
సినిమాల వల్ల ఆచరణ సాధ్యం కాదు. వ్యవస్థలు మారవు. అందుకే నిజజీవితంలో నేను సత్యాగ్రహిగా మారడానికి సిద్ధపడ్డాను. 2003లో రాజకీయాల్లోకి రావాలని అమ్మా, నాన్న, అన్నయ్య చిరంజీవికి చెప్పాను.
సినిమాలు విజయం సాధిస్తుంటే నాకు ఆనందం లేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరిక రోజు రోజుకు బలంగా మారింది.

Recommended