Venkatesh And Rajasekhar Multistarrer Movie ? ఈ కాంబో సెట్ అవుతుందా?

  • 7 years ago
Tollywood Latest Buzz is that senior hero Rajasekhar, who has recently made a comeback with 'Garuda Vega', is in talks to essay the character of Venkatesh's brother-in-law.

ఒకప్పుడు యాంగ్రీ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజశేఖర్‌కు చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. ఈ నేపథ్యంలోనే, ఇటీవల ఆయన విలన్ పాత్రలకు షిఫ్ట్ అవుతున్నాడని ప్రచారం జరిగింది. అయితే, అలాంటి వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటిదాకా విలన్‌గా ఒక్క సినిమా కూడా ఆయన ఒప్పుకోలేదు.
అయితే ఈ మధ్య వచ్చిన గరుడ వేగ మంచి విజయాన్నే అందుకున్నా పూర్తి స్థాయిలో ఆర్థికంగా రాజశేఖర్ ని ఆదుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. ఆయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే చాలా విషయాలు చెప్పాడు ఈ యాంగ్రీ యంగ్ మాన్. వాటిలో ఇప్పుడు ఒక కోరిక తీరుతున్నట్టే ఉంది....
బాలకృష్ణ 102వ సినిమాలో విలన్‌గా నటించమని తనను అప్రోచ్ అయ్యారని, అయితే తన పాత్ర రొటీన్‌గా ఉండటంతో తాను ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. నటనకు స్కోప్ ఉన్న మంచి విలన్ రోల్స్ వస్తే నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే ఇప్పుడు రాజశేఖర్ కోరిక నెరవేరే చాన్స్ వచ్చినట్టే ఉంది...
ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు గానీ... వెంకటేష్ తేజా కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రాజశేఖర్ విలన్‌గా చేయోబోతున్నాడు అంటూ ఒక మాట వినిపిస్తోంది టాలీవుడ్‌లో.
"నేనే రాజు నేనే మంత్రి" సినిమా కోసం ముందుగా "యాంగ్రీ యంగ్ మ్యాన్" రాజశేఖర్ ను సంప్రదించానని తేజ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్ర క్లైమాక్స్ విషయంలో వారిద్దరికీ అభిప్రాయభేదాలు రావడంతో రాజశేఖర్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ అవకాశాన్ని అందుకున్న రానా - తేజలు హిట్ ను అందుకున్నారు.