Kim Jong-un's hit list Here : అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌, గ్వామ్‌ ద్వీపాలే లక్ష్యం

  • 7 years ago
Kim Jong-un's hit list includes major US cities and specifically names The White House and The Pentagon, it has been revealed. A report by the think tank European Commission of Foreign Relations shows a list of 15 North Korean targets.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచంలోని 15 ప్రాంతాలను లక్ష్యంగా అణు దాడులు జరపాలని ప్లాన్ చేశారని నివేదికలు బట్టబయలయ్యాయి. ఈ విషయం వెలుగు చూడడంతో ప్రపంచదేశాలు నివ్వెరపోయాయి.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ రెండు మాసాలుగా ఎలాంటి కవ్వింపుచర్యలకు పాల్పడడం లేదని వార్తలు వచ్చిన వారం రోజులకే అణుదాడులకు సంబంధించి కిమ్ రూపొందించిన ప్లాన్ బట్టబయలు కావడం ఆందోళన కల్గించేదిగా ఉంది.
ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జంగ్ ఉన్ వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ఉత్తరకొరియాపై ఆంక్షలను విధించారు.
అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌, గ్వామ్‌ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అణు బాంబులు విసిరేందుకు సిద్ధమయ్యారనే రిపోర్టులు వస్తున్నాయి.అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌, గ్వామ్‌ ద్వీపాలే లక్ష్యంగా ఉత్తరకొరియా అణుదాడులకు పాల్పడే అవకాశం ఉందని యూరోపియన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(ఈయూఎఫ్‌ఆర్‌) ప్రకటించింది. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలను పలుమార్లు నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పింది.

Recommended