Krishna river boat capsized : సింగపూర్‌ టూరిజం కాదు, సేఫ్టీ టూరిజం కావాలి | Oneindia Telugu

  • 7 years ago
Krishna river boat capsized : Tourism Minister Akhila Priya requested CPI Narayana to take their relatives bodies from hospital

కృష్ణా నదిలో చోటు చేసుకున్న బోటు ప్రమాదం సీపీఐ నేత నారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో నారాయణ బంధువులు ముగ్గురు చనిపోవడం ఆయన కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది.ఆదివారం నాడు ఈ దుర్ఘటన జరగ్గా.. ఆ సమయంలో నారాయణ పాట్నాలో ఉన్నారు. సీఎం కార్యాలయం అధికారులు, పర్యాటక మంత్రి అఖిలప్రియ ఫోన్‌ చేసి సమాచారమందించారు.
నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు ప్రభుకిరణ్. ఈయన విజయవాడ బందరు రోడ్డులో నివాసముంటున్నారు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రభుకు భార్య హరిత(30), కుమార్తె హస్విక(7) ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని కురుగొండ్ల వీరి స్వస్థలం. ఆదివారం నాటి దుర్ఘటనలో హరిత, హస్విక దుర్మరణం పాలయ్యారు.
హస్విక మృతదేహం లభ్యం కాకపోవడతో.. ఆమె మృతదేహం దొరికేవరకు లలితాదేవి, హరితల మృతదేహాలను కూడా తీసుకెళ్లేది లేదని బంధువులు తెగేసి చెప్పారు. దీంతో మంత్రి అఖిలప్రియ సీపీఐ నారాయణకు ఫోన్ చేసి జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. వారికి నచ్చజెప్పి మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా కోరారు. చిన్నారి హస్విక మృతదేహం దొరకగానే తానే దగ్గరుండి స్వయంగా ఇంటికి చేరుస్తానని హామి ఇచ్చారు. దీంతో నారాయణ తమ బంధువులకు నచ్చజెప్పారు. ఆపై వారి మృతదేహాలను గూడూరుకు తరలించినట్టు తెలుస్తోంది.