ఫ్యామిలీ డిజిటల్​ కార్డులు ప్రారంభించిన CM రేవంత్

  • 10 hours ago
CM Revanth on HYDRA : హైడ్రాపై అసెంబ్లీలో చర్చించామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఆనాడు హైడ్రాపై సూచనలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు 15 వేల ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు. డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముందని ప్రసంగించారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తాం, వచ్చి సలహాలు ఇవ్వండని ప్రతిపక్షాలకు సూచించారు. కేటీఆర్​, హరీశ్​రావు, సబిత కుమారుల ఫామ్​హౌస్​లు కూల్చాలా? వద్దా? చెప్పండని అడిగారు. ఫామ్​హౌస్​లు కూల్చుతారనే పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు, హైదరాబాద్​లో మీ భరతం పడతామని హెచ్చరించారు.

Category

🗞
News

Recommended