• 2 years ago
T20 World Cup 2022 - Mohammed Shami says I was out of the Indian T20 team but never out of practice | టీ20 ఫార్మాట్‌కు బీసీసీఐ తనను దూరం పెట్టినా.. తాను ప్రాక్టీస్ చేయడం మానలేదని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు.టీ20 ఫార్మాట్‌కు బీసీసీఐ తనను దూరం పెట్టినా.. తాను ప్రాక్టీస్ చేయడం మానలేదని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. టీ20 ఫార్మాట్‌ ఆడేందుకు నెట్స్‌లో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసేవాడినని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2022 కోసం అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షమీ అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం షమీని టీ20 ఫార్మాట్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ పూర్తిగా దూరం పెట్టింది. ఐపీఎల్‌ 2022లో గుజరాత్ టైటాన్స్‌ తరఫున రాణించినా పరిగణలోకి తీసుకోలేదు. ఇక స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో చివరి నిమిషంలో దూరమవ్వడంతో టీమిండియా పిలుపును అందుకున్న షమీ.. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా మెగా టోర్నీ బరిలోకి దిగాడు.


#JaspritBumrah
#T20WorldCup
#MohammadShami
#Australia
#Cricket
#BCCI

Category

🥇
Sports

Recommended