• 2 years ago
Ind vs Sa 2nd ODI - Shreyas Iyer Century Knock Helped India To Level The Serie 1-1 | మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో సౌతాఫ్రికాను భారత్ చిత్తు చేసింది. వన్డేల్లో తనదైన మాస్టర్ క్లాస్ ఫామ్ కొనసాగించిన శ్రేయస్ అయ్యార్.. పద్ధతైన సెంచరీతో మెరిసిన వేళ ఇండియా సిరీస్ 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 278పరుగులు చేయగా.. 279పరుగుల లక్ష్యాన్ని మరో 25బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించి 7వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌లో 279పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించిందంటే అందుకు ప్రధానంగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ కారణం. ఇషాన్ కిషన్ (93పరుగులు 84బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు), శ్రేయస్ అయ్యార్ (113పరుగులు 111బంతుల్లో 15ఫోర్లు నాటౌట్) వీరిద్దరు ఫుల్ షాట్లు, కట్ షాట్లు, కవర్ డ్రైవ్స్ ఇలా రకరకాల షాట్లు ఆడుతూ సౌతాఫ్రికా బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకున్నారు. కుదురుకున్నాక రన్ రేట్‌ను మెరుగుపరుచుకుంటూ దంచికొట్టారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫార్చున్ 1, రబాడ 1, పార్నెల్ 1 వికెట్లు తీశారు.




#IndiavsSouthafrica
#SreyasIyer
#Cricket
#National
#INDvsSA

Category

🥇
Sports

Recommended