IND vs NZ : Venkatesh Iyer కనబడలేదా ? Rohit Sharma కెప్టెన్సీ ని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు

  • 3 years ago
India vs New Zealand 1st T20I: Cricket Experts and Fans Points Tactical Mistake From Rohit Sharma In 1st T20I.
#INDVSNZ1stT20I
#VenkateshIyer
#RohitSharma
#MartinGuptill
#RishabhPant
#IPL2022

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన భారత్ ఐదు వికెట్లతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఆసాంతం రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుంది. కుర్రాళ్లకు విలువైన సలహాలిస్తూ మైదానంలో చురుగ్గా కదిలాడు. అటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. బౌలర్లు పరుగులు భారీగా ఇచ్చినప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లి ప్రొత్సహించాడు. ఫీల్డ్ సెటప్, బంతులు వేసే విషయంలో వారికి పూర్తి స్వేచ్చనిస్తూ విలువైన సలహాలు ఇచ్చాడు. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ ధోనీని తలపించాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అయితే, ఫస్ట్ మ్యాచులోనే రోహిత్ శర్మ ఓ తప్పిదం చేశాడు. ప్రస్తుతం ఈ తప్పిదాన్నే అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Recommended