Jaskaran Malhotra : వామ్మో.. వంద పరుగులు బౌండరీల ద్వారానే.. | Usa Vs PNG || Oneindia Telugu

  • 3 years ago
USA vs PNG: Chandigarh-born Jaskaran Malhotra hits six sixes in one over
#JaskaranMalhotra
#Usavspng
#UsaCricketTeam
#Uae

ఓమన్ వేదికగా పపువా న్యూగినియా, అమెరికా జట్లు అంతర్జాతీయ వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. అమెరికా ప్లేయర్స్ అందరూ విఫలమయినా.. భారత సంతతికి చెందిన జస్కరన్ మల్హోత్రా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. పపువా న్యూగినియా ఏ బౌలర్‌ను వదలకుండా బాదాడు. 124 బంతుల్లో 173 రన్స్ చేశాడు. మల్హోత్రా తన ఇన్నింగ్స్‌లో కేవలం 4 బౌండరీలు మాత్రమే బాది.. ఏకంగా 16 సిక్సులు కొట్టాడు. బౌండరీల ద్వారానే 100కు పైగా పరుగులు చేశాడు. ఈక్రమంలోనే ఒకే ఓవర్ లోని ఆరు సిక్సులు బాదాడు.

Recommended