#Ghatkesar: కిడ్నాప్,అత్యాచారం ఏదీ జరగలేదు.. తల్లికి బయపడి కిడ్నాప్ నాటకమాడిన బీఫార్మసీ విద్యార్థిని

  • 3 years ago
Sensational facts came into light in the incident of Ghatkesar in the state Telanagana.
#Ghatkesar
#Telanagana
#Student
#Viral
#Sensationalfacts
#పోలీస్ కమిషనర్

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఘట్‌కేసర్‌లో యువతిపై అఘాయిత్యం ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ యువతి చెప్పిందంతా పూర్తిగా కట్టు కథ అని పోలీసులు తేల్చారు. కిడ్నాప్,అత్యాచారం ఏదీ జరగలేదని... ఉద్దేశపూర్వకంగానే యువతి ఈ సీన్ క్రియేట్ చేసిందని నిర్దారించారు. మూడు రోజుల నుంచి 100 మంది పోలీసులు కంటి మీద కునుకు లేకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా... తీరా యువతి పోలీసులను పూర్తిగా తప్పుదోవ పట్టించినట్లు తేలింది. తాను చెప్పిందంతా కట్టు కథేనని డీసీపీ రక్షితకు యువతి వెల్లడించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

Recommended